వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా చిట్కాలు..
24 August 2023
వర్షాకాలంలో గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాల్లో మొదటిది సరైన ఆహార అలవాట్లు. రెండోది శుభ్రమైన నీళ్లు తాగడం.
ఈ కాలంలో నీళ్లు ఖచ్చితంగా మరగపెట్టి తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే పెరుగు వంటి పులియబెట్టిన ఆహారాలకు దూరంగా ఉండాలి.
మితంగా తినాలి వర్షాకాలంలో ఆహారం ఎప్పుడూ మితంగానే తీసుకోవాలి. అలాగే ఉప్పు కూడా ఎక్కువగా తినకూడదు. దీనితోపాటు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి.
వర్షాకాలంలో సాధారణంగా తేలికపాటి జ్వరం వస్తూ ఉంటుంది.అలాంటప్పుడు.. ఒక లీటరు నీళ్లలో టీస్పూన్ అల్లం పొడి కలిపి మరిగించాలి.
ఈ నీటిని వేడిగా తాగడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. అయితే రోజు అదేపనిగా ఈ కషాయాన్ని అస్సలు అధికంగా తాగ కూడదు.
అదేవిధంగా నీళ్లలో ధనియాలను కూడా వేసి మరిగించిన నీటిని తాగవచ్చు. దీనిని కూడా రోజూ తాగకూడదు. జ్వరంగా ఉన్నప్పుడు ఈ నీళ్లను తాగితే జ్వరం నయమవుతుంది.
ఇక ఈ కాలంలో స్కిన్ అలెర్జీలు, ఫంగస్ రావడం కూడా సాధారణమే. వీటి నివారణకు వేప ఆకుల పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ పేస్టును స్నాననికి ముందు శరీరానికి అప్లై చేసి, ఆ తర్వాత స్నానం చేస్తే చర్మ సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి