ఈ చిట్కాలతో కడుపులో వేడి సమస్యకు చెక్..
24 August 2023
ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా తరచుగా మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో వేడిని కలిగి ఉంటారు.
ఉదరం వేడి కారణంగా ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో కడుపులో మంట, ఉబ్బరం, నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
ఉదరంలో వేడి పెరగడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకోవం మంచిది. దీంతోపాటు ఉదరం వేడి సమస్యను ఎలా బయటపడాలో తీలుసుకుందాం.
ఎక్కువ కారంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, ఎక్కువ నాన్-వెజ్ ఫుడ్ తినడం, ఆల్కహాల్ తాగడం – స్మోకింగ్ చేయడం దీనికి ప్రధాన కారణాలు.
ఎక్కువ మందులు తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువగా టీ తాగడం కూడా కడుపులో వేడి సమస్యకు కారణం.
శరీరంలో నీటి కొరత కారణంగా కడుపులో వేడి కలుగుతుంది. ఈ ఆహారాలను ఇలా తీసుకుంటే కడుపులో వేడి తగ్గుతుంది.
పుదీనా నీరులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, మెడిసినల్ గుణాల వల్ల కడుపులో మంట తగ్గుతుంది.
సోంపు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఉదయం నిద్రలేవగానే సోంపు నీటిని తాగితే కడుపు వేడిని శాంతపరచడంలో సహాయపడుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి