వర్షాకాలం వచ్చిందంటే మలేరియా, డెంగ్యూ విజృంభిస్తాయి. ఒక్కసారి ఈ జబ్బులన్నీ దాడిచేస్తే శరీరం చాలా బలహీనంగా మారుతుంది. డెంగ్యూ నయమైనా కనీసం 7 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి
TV9 Telugu
కొన్ని సందర్భాల్లో డెంగ్యూ నయమవుతుంది కానీ దాని బీజాంశం శరీరం లోపల ఉండిపోతుంది. దీంతో తీవ్రమైన బలహీనత, కండరాల నొప్పి, తల తిరగడం, వికారం, జుట్టు రాలడం, మానసిక కల్లోలం, చూపు మందగించడం వంటి పలు సమస్యలు తలెత్తుతాయి
TV9 Telugu
చాలా మంది డెంగ్యూ నుంచి కోలుకుని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, గుండె కొట్టుకోవడంలో ఇబ్బంది వంటి వివిధ సమస్యలు కనిపిస్తాయి. దీనినే 'మయోకార్డిటిస్' అంటారు
TV9 Telugu
డెంగ్యూ నుంచి కోలుకున్న 5 రోజుల తర్వాత ప్లేట్‌లెట్స్ తిరిగి పడిపోవడం కూడా చాలా సందర్భాలలో సంభవిస్తుంది. డెంగ్యూ రికవరీ తర్వాత ఇతర వ్యాధులు కూడా దాడి చేస్తాయి
TV9 Telugu
చాలా మంది రోగులు డెంగ్యూతో కోలుకున్న తర్వాత కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వంటి సమస్యలు ఫిర్యాదు చేస్తారు. తలనొప్పి. మైగ్రేన్‌లతో కూడా వీరిలో కనిపిస్తుంది. అలాగే ఆకస్మిక బరువు తగ్గిపోతుంటారు. ఇది సాధారణంగా విటమిన్ల లోపం వల్ల వస్తుంది
TV9 Telugu
డెంగ్యూ వ్యాధి మన శరీరంలో కాలేయం, మూత్రపిండాలను కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి డెంగ్యూ నయమైన తర్వాత కూడా తదుపరి 48 నుంచి 72 గంటల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి
TV9 Telugu
డెంగ్యూ కాలేయం, మూత్రపిండాలు మాత్రమే కాకుండా గుండె, ఊపిరితిత్తులను కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి రోగికి కూడా దీనిపై అవగాహన ఉండాలి. సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించాలి
TV9 Telugu
కానీ ఈ వ్యాధిలో చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే.. నీళ్లు అధికంగా తాగాలి. పండ్ల రసం, పప్పు ఉండేలా చూసుకోవాలి. సూప్, పెరుగు, విటమిన్ సి, చికెన్ సూప్, గుడ్లు మొదలైన ప్రోటీన్ ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి