ఈ ఫుడ్స్ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి..

09 August 2023

ఈ ఆహార పదార్థాలను రోజూ తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఆ ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రొమ్ము క్యాన్సర్: రొమ్ము క్యాన్సర్ మహిళల్లో సాధారణ వ్యాధిగా మారింది. పాలిచ్చే తల్లులో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే, పురుషుల్లో కూడా ఈ సమస్య ఉంది.

రొమ్ము క్యాన్సర్ లక్షణాలు:  మహిళ రొమ్ము పరిమాణంలో తేడా, ఉత్సర్గ లేదా ఛాతీలో స్థిరమైన నొప్పిని ఎదుర్కొంటుంటే వెంటనే రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి.

రొమ్ము క్యాన్సర్ నివారణ  చిట్కాలు: జన్యుపరంగానే కాకుండా ఆహారంతో కూడా క్యాన్సర్ రావచ్చు. అయితే, కొన్ని పదార్థాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

వెల్లుల్లి: వెల్లుల్లి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, యాంటీకార్సినోజెనిక్ లక్షణాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

సిట్రస్ ఫుడ్స్: నిమ్మకాయ, కివి వంటి వాటిలో విటమిన్ సి, ఫోలెట్, ఫ్లెవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

యాపిల్: యాపిల్ వంటి పండ్లు కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రొమ్ము క్యాన్సర్ కణాలను అడ్డుకోవడంలో ఇది ఉపకరిస్తుంది.

పాలకూర, ఆవాలు: పాలకూర, ఆవాలు ఆహారంలో చేర్చుకోవడం మంచిది. పరిశోధనల ప్రకారం.. క్యాన్సర్ నుంచి రక్షించే ఫోలేట్స్, బి విటమిన్స్ ఇందులో ఉన్నాయి.