ఈ 5 అలవాట్లు మీ కాలేయాన్ని దెబ్బతీస్తాయి..

15 September 2023

కాలేయ వ్యాధులు: కాలేయాన్ని దెబ్బతీసే ఈ 5 రోజువారీ అలవాట్లను ఇప్పుడే మానేయండి. లేదంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

కాలేయ వ్యాధులు

 జంక్ ఫుడ్ తినడం వల్ల కాలేయంపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. రోజూ జంక్ ఫుడ్ తినేవాళ్లు ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడుతున్నారు. 

జంక్ ఫుడ్ అలవాటు

మీరు ప్రతిరోజూ రాత్రిపూట ఆలస్యంగా తింటే, అది జీర్ణక్రియ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల కాలేయ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.

అర్థరాత్రి భోజనం

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ సిర్రోసిస్ వస్తుంది. ఇది తరువాత కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది. అందుకే తప్పనిసరిగా ఆల్కాహాల్ తీసుకోవడం మానేయాలి.

ఆల్కాహాల్

రెడ్ మీట్ అధికంగా తినడం వల్ల కాలేయ పనితీరుపై ప్రభావం చూపుతుంది. రెడ్ మీట్ చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీని వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది.

రెడ్ మీట్

చక్కెర ఊబకాయాన్ని పెంచడమే కాకుండా కాలేయం ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అధిక మొత్తంలో చక్కెర తినడం కాలేయ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.

చక్కెర

దేశ వ్యాప్తంగా కాలేయ వ్యాధుల కేసులు పెరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ప్రతి నాల్గవ వ్యక్తికి ఫ్యాటీ లివర్ వ్యాధి ఉంటుంది.

చక్కెర

మీ ఆహారంపై శ్రద్ధ వహించండి. రోజూ వ్యాయామం చేయండి. ఆహారంలో పండ్లు, ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోండి. మద్యం సేవించవద్దు. 

వ్యాయామం