చింతపండుతో ఇన్ని లాభాలా.? 

15 January 2024

TV9 Telugu

చింతపండులో ఉండే ఔషధగుణాలు మల బద్ధకం సమస్యను దూరం చేస్తుంది. చింతపండు మంచి విరేచనకారిగా పనిచేసి కడుపును శుభ్రం చేస్తుంది. 

చింతపండు మాత్రమే కాకుండా చింతాకులతో కూడా ఎంతో మేలు జరుగుతుంది. చింతాకులను మరిగించి, ఆ నీరు తాగితే పచ్చ కామెర్లు దూరం అవుతుందని చెబుతున్నారు. 

చింతపండుతో కషాయం చేసుకొని తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ కషాయంను తీసుకోవడం ద్వారా మలేరియాను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. 

చింతపండు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా శరీరంలోని చెడు కొవ్వును తగ్గించి, గుండెను పదిలంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. 

క్యాన్సర్‌కు చెక్‌ పెట్టడంలో కూడా చింతపండు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. చింతపండులోని యాంటీఆక్సిడెంట్స్‌ వల్ల క్యాన్సర్‌ కారకాలు వృద్ధి చెందవు.

వీటితో పోటు చింతపండులోని కొన్ని ఔషధ గుణాలు శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులు, కళ్లు, చర్మ ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి. 

చింతపండును నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల నొప్పులు, జ్వరాల నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.