రాగి జావను ఉదయం అల్పాహారంగా తీసుకుంటే ఎంతో మేలు జరగుతుంది. రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఇన్‌స్టంట్ ఎనర్జీనిస్తుంది.
చిన్న పిల్లలకు కూడా రాగి జావ ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ప్రతి రోజూ రాగి జావ తాగించడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది.
వేడి శరీరంతో బాధపడే వారికి రాగి జావ దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా రాగిజావ తీసుకుంటే.. వేడిని గ్రహించి చల్లదనాన్ని ఇస్తుంది.
రాగిజావలోని ప్రోటీన్లు శారీరక దృఢత్వానికి కూడా దోహదపడతాయి. ప్రతీరోజూ రాగిజావను డైట్‌లో భాగం చేసుకుంటే కాళ్లు, చేతులు దృఢంగా మారుతాయి.
రాగి జావతో కలిగే మరో అద్భుత ప్రయోజనం రక్తపోటును అదుపులోకి రావడం. అలాగే రాగిజావను క్రమంతప్పకుండా తీసుకుంటే షుగర్ సైతం కంట్రోల్‌లో ఉంటుంది.
పురుషుల ఆరోగ్యానికి కూడా రాగి జావ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వీర్యకణాల వృద్ధి బాగా పెరుగుతుంది. కాబట్టి సంతాతోత్పత్తికి దోహదపడుతుంది.
రాగి జావలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దారి చేరవు. ప్రతిరోజూ రాగి జావ తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది.
డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలకు కూడా రాగిజావ ఉపయోగపడుతుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, ట్రిప్టోఫాన్, అమైనో ఆమ్లాలు విశ్రాంతతని అందిస్తాయి.