శరీంలో ఊపిరితిత్తుల పాత్ర ఎంత ప్రాధానమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆక్సిజన్ శరీరానికి చేరవేయడంలో వీటితో ముఖ్యపాత్ర.
అయితే లంగ్స్ ఏమాత్రం అనారోగ్యం బారిన పడినా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ శ్వాస సంబంధిత వ్యాధులను కొన్ని లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు.
మూడు వారాలకు మించి దగ్గు తగ్గకపోతే వెంటనే అలర్ట్ కావాలని నిపుణులు చెబుతున్నారు. ఎడతెరపిలేని దగ్గు ఉంటే వైద్యులను సంప్రదించాలి.
శ్వాస తగ్గుతున్నట్లు అనిపించినా ఊపిరితిత్తులకు ఏదో సమస్య ఉందని భావించాలని నిపుణులు చెబుతున్నారు. దీనిని డిస్‌ప్నియాగా పిలుస్తుంటారు.
దీర్ఘకాలంగా ఛాతిలో పట్టేసిట్లున్నా, నొప్పిగా ఉన్నా నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది.
దగ్గుతో పాటు రక్తం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీనిని హీమోటైసిస్‌గా పిలుస్తుంటారు. లంగ్స్‌లో సమస్య వల్లే ఈ పరిస్థితి వస్తుంది.
ఇక న్యూమోనియా వంటి శ్వాస సంబంధిత సమస్యలు పదే పదే వస్తుంటే లంగ్స్ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లు అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.