క్యాన్సర్‌కు చెక్ పెట్టడంలో మిరియాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మిరియాలను క్రమంతప్పకుండా తీసుకుంటే.. రొమ్ము, ఉపిరితిత్తులు, పెద్దప్రేగు క్యాన్సర్‌లు దరి చేరవు.
ఆపిల్‌తో ఆరోగ్యం మెరుగవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆపిల్‌లో క్వెర్సెటిన్, ఎపికాటెచిన్, ఆంథోసైనిన్స్ క్యాన్సర్‌ను దరిచేరనివ్వవు.
బ్లూ బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగంగా చేసుకుంటే.. నోరు, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి.
కాలీఫ్లవర్‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదులను అడ్డుకునే గుణం ఎక్కువగా ఉంటుంది.
క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే.. చెర్రీలను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వ్యాధినిరోధకతను పెంచడంతో పాటు క్యాన్సర్ దరిచేరకుండా చూస్తుంది.
ద్రాక్షను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల క్యాన్సర్ దూరమవుతుంది. నిత్యం ద్రాక్షను ఆహారంలో భాగం చేసుకోవాలంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
గ్రీన్ టీని నిత్యం భాగం చేసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ కారకాలకు చెక్ పెట్టొచ్చు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కారకాలను తగ్గిస్తాయి
వాల్‌నట్స్‌ను తీసుకోవడం వల్ల క్యాన్సర్ కారకాలను తగ్గించవచ్చు. వాల్‌నట్స్‌తో బ్రెస్ట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చని తాజా అధ్యయనంలో తేలింది.