చలికాలం రోగాల బారిన పడొద్దంటే.. 

11 December 2023

చలికాలం వచ్చే వ్యాధులకు చెక్‌ పెట్టాలంటే యాపిల్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఫైబర్‌ సమృద్ధిగా ఉండే యాపిల్‌ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

చలికాలం వ్యాధులకు చెక్‌ పెట్టడంలో విటమిన్‌ సీ కీలక పాత్ర పోషిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే నిమ్మజాతి పండ్లను ఆహారంలో భాగం చేసకోవాలి. 

చలికాలం వచ్చే ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో అరటి కీలక పాత్ర పోషిస్తుంది. అరటిలో ఉండే పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీంతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. 

చలికాలం అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోవాలి. ఇలాంటి ఫుడ్‌లో దానిమ్మ మొదటి స్థానంలో ఉంటుంది. 

కివీ కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని విటమిన్‌ సి, కే, ఫైబర్‌ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లకు వీటితో చెక్‌ పెట్టొచ్చు. 

చలి కాలంలో శరీరాన్ని సంరక్షించడంలో బెర్రీలు ఎంతగానో ఉపయోగపడుతాయి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. 

యాంటీ ఆక్సిడెంట్స్‌కు పెట్టింది పేరైన ద్రాక్ష పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనిద్వారా చలికాలం వచ్చే అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. 

పైన తెలిపిన విషాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు అందించినవి మాత్రమే.. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం.