వీటిని ఫ్రిడ్జ్‌లో ఉంచి వేడి చేసి తింటే ఎన్నో దుష్ప్రభావాలు..
09 August 2023
వర్షాకాలంలో వేడివేడిగా తినడానికి చాలామంది ఇష్టపడతారు. ఎప్పటికప్పుడు వేడివేడిగా వండుకుని తింటే ఆరోగ్యానికి కూడా మంచిది.
అయితే కొంతమంది చికెన్, చేపలు, రొయ్యలతో చేసిన మిగిలి ఉన్న కూరలను ఫ్రిడ్జ్‌లో ఉంచి రెండు మూడురోజుల తర్వాత వేడి చేసుకుని తింటారు.
ఇలా చేయడం వల్ల ఆహారంలో ప్రొటీన్స్ విషంగా మారి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని అంటున్నారు పోషకాహార నిపుణులు.
ప్రొటీన్ పుష్కలంగా ఉన్న చికెన్‌ను ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసి పదే పదే చేస్తే అందులో ప్రొటీన్ పోయి ప్రమాదకరంగా మారుతుంది.
మిగిలిపోయిన అన్నం ఫ్రిడ్జ్‌లో పెట్టి మరలా వేడి చేసి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు.
ఫ్రిడ్జ్‌లో ఎక్కువరోజులు స్టోర్ చేసిన అన్నంలో హానికరమైన బ్యాక్టీరియా చేరి శరీరానికి హానికరంగా మారుతుంది.
చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఆహారాన్ని నిల్వ ఉంచితే వాటి రుచి, వాటిలో పోషకాలు కూడా తగ్గిపోయి ప్రమాదకరంగా మారుతాయి.
సీ ఫుడ్స్‌ని ఫ్రిడ్జ్‌లో ఉంది వేడి చేసి తీసుకోవడం వల్ల చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చర్మంపై దద్దుర్లు, దురద వంటి సమస్యలు వస్తాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి