నిమ్మరసం ఇలా తీసుకుంటే అనేక ప్రయోజనాలు..

28 August 2023

నిమ్మరసం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇది జీర్ణక్రియ సమస్యలను దరిచేరనివ్వదు. దీనిలో ఉన్న విటమిన్ సి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

దీన్ని తీసుకుంటే ఎముకలను బలోపేతం చేస్తుంది. ఇప్పుడు ఆహారం తీసుకున్న తర్వాత నిమ్మరసం తాగితే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

భోజనం తర్వాత వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల  జీర్ణక్రియకు మెరుగుపడుతుంది. ఇది అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.

వెచ్చని నీరు- నిమ్మకాయ కలిపి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

దీన్ని తాగితే  జలుబు, ఫ్లూ నుంచి  కాపాడడంలో సహాయపడుతుంది. అందుకే తరుచూ నిమ్మరసం తాగడం అలవాటు చేసుకోండి.

ఏది శరీరంలో టాక్సిన్స్, హానికరమైన కణాలను బయటకు తరిమేస్తుంది. అందుకే ప్రతి భోజనం చేసిన తర్వాత కచ్చితంగా నిమ్మరసం తీసుకోవాలి.

రోజూ భోజనం ముగించి చివర్లో  గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి రక్తపోటుని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.

ఇందులో ఉన్న సిట్రిక్ యాసిడ్ ఎన్నో విధాలుగా  ఆరోగ్యానికి మేలు చేకూర్చుతుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి  ఇది మంచి ఎంపిక.