టీ Vs కాఫీ.. ఇందులో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా!
samatha
25 February 2025
Credit: Instagram
చాలా మంది టీ లేదా కాఫీతోనే రోజును ప్రారంభిస్తారు. ఇంకొందరైతే అసలు టీ లేదా కాఫీ తాగనిదే రోజేగడవనట్లు ఉంటుందని చెబుతారు.
అయితే కొంతమంది ఎంతో ఇష్టంగా టీ తాగితే, మరికొంత మంది మాత్రం కాఫీ తాగడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు.
మరి ఈ రెండింటిలో ఏదీ తాగడం వలన ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి. ఉదయాన్నే కాఫీ తాగడం మంచిదా? లేకా టీ తాగడం మంచిదా?
అనే ఆలోచనలు చాలా మందిలో ఉంటాయి. కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం. దీని గురించి వైద్యులు ఏం చెబుతున్నారంటే?
టీ, కాఫీ రెండూ మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే శక్తివంతమైన పానీయాలు. ఇవి మీ శారీరక ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, మీ మనస్సును చురుగ్గా చేస్తాయి.
కాఫీతో పోలిస్తే, టీలో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి.
టీ కంటే కాఫీలో ఎక్కువ కెఫిన్ ఉంటుంది. కాబట్టి, మీరు మీ కెఫిన్ తీసుకోవడం తగ్గించుకోవాలని ప్లాన్ చేస్తుంటే, టీ చాలా మంచిదంటున్నారు నిపుణులు
బరువు తగ్గాలని ఫ్లాన్ చేస్తున్నవారికి కాఫీతాగడం ఉత్తమ ఎంపిక, అలాగే డయాబెటీస్ ఉన్న వారు టీ తాగడం కంటే కాఫీ తాగడమే మేలు అంటున్నారు నిఫుణులు.