పొట్ట గుట్టలా ఉన్నా కరిగిపోవాల్సిందే.. ఇవి రెండు తీసుకుంటే చాలు

Ravi Kiran

16 Aug 2024

వెల్లుల్లి.. ప్రతి వంటగదిలో ఉంటుంది. వెల్లుల్లిలో ఔషధ గుణాలతోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. 

వెల్లుల్లి బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. ఇది బరువు తగ్గడానికి గొప్ప ఔషధంగా పనిచేస్తుందట.

ఉదయాన్నే వెల్లుల్లిపాయలు తిన్నా.. లేదా దాని రసం తాగినా ఆరోగ్యంగా ఉంటారు. ఇది రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. 

ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లి నీటిని తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. 

ప్రతిరోజూ ఉదయాన్నే గార్లిక్ వాటర్ తాగడం వల్ల ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది. చెడు కొవ్వులను కరిగించడంలో సహాయపడతాయి. 

వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షిస్తాయి. ఇది చర్మంపై ముడతలను నివారిస్తుంది. ఇంకా అలెర్జీలను దరిచేరనివ్వకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఉదయాన్నే పచ్చి వెల్లుల్లి రెబ్బలను రెండింటిని తినవచ్చు. వెల్లుల్లి కలిపిన నీటిని తాగవచ్చు. ఇలా చేయడం ద్వారా కాలక్రమేణా మీరు సులభంగా బరువు తగ్గవచ్చు.

వెల్లుల్లి వేడి స్వభావం కలిగి ఉంటుంది.. ఇది ఫ్యాట్ బర్నర్ గా పనిచేస్తుంది.. వీటిని ఆహారం, సూప్ లాంటి వాటిలో ఉపయోగించి తీసుకోవచ్చు.