జిమ్‌కు వెళ్లకుండానే.. ఈజీగా బరువు ఇలా తగ్గండి

18 January 2025

Ravi Kiran

ఈ మధ్యకాలంలో ఒబేసిటీ అందరినీ ఇబ్బంది పెడుతోంది. అందుకే చాలామంది యువత బరువు తగ్గించుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తుంటారు. 

ఈ క్రమంలోనే జిమ్‌కు వెళ్తారు. రాత్రిపూట అన్నం మానేసి చపాతీలు తింటుంటారు. అయితే ఇలా రాత్రి భోజనం చేయకపోతే

రాత్రిపూట భోజనం చేయకపోతే బరువు తగ్గుతామని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పు అని వైద్యులు అంటున్నారు.   

 నైట్ భోజనం చేయకపోతే మధ్యరాత్రి ఆకలివేసి నిద్రకు భంగం కలుగుతుంది. ఎసిడిటీ, కడుపు నొప్పి సమస్యలు వస్తాయి.

అలాగే మరుసటి రోజంతా నీరసంగా ఉంటుంది. బద్ధకం, చికాకు లాంటివి పెరుగుతాయి. 

ఉదయం లేవగానే బాగా ఆకలేసి ఎక్కువ తింటారు. ఇది బరువు పెరుగుదలకు కారణం అవుతుంది. 

అందుకే ప్రతిరోజూ రాత్రి తప్పకుండా భోజనం చేయాలి. అయితే రోస్టెడ్ ఫుడ్‌తో పాటు ఫాస్ట్ ఫుడ్ వంటివి తినకూడదు.