వర్షాకాలంలో నెయ్యితో నల్ల మిరియాలు తీసుకుంటే ఆ సమస్యలు పరార్..
20 August 2023
నల్ల మిరియాలను నెయ్యితో కలిపి తీసుకుంటే, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఆ లాభాలేంటో ఓసారి చూద్దాం.
1/2 టీస్పూన్ నల్ల మిరియాలు ఒక టీస్పూన్ దేశీ నెయ్యితో కలిపి తీసుకోవాలి. నల్ల మిరియాలు వేడిని తగ్గిస్తుంది. తద్వారా దగ్గు నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది.
నెయ్యితో మిరియాలను కలిపి తింటే రోగ నిరోధక శక్తి బలపడుతుంది. నల్ల మిరియాలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే, నల్ల మిరియాల పొడిని నెయ్యిలో కలిపి తినడం వల్ల మేలు జరుగుతుంది.
కంటి చూపు బలహీనంగా ఉన్నవారు కొన్ని చుక్కల దేశీ నెయ్యిలో నల్ల మిరియాల పొడిని కలపండి. ప్రతిరోజూ తినండి.
కావాలంటే, అరికాళ్ళకు కూడా దీనిని రాసుకోవచ్చు. ఇది తక్కువ కంటి చూపు ఉన్నవారికి కూడా మేలు చేస్తుంది.
వృద్ధాప్యంలో తరచుగా కీళ్ల నొప్పుల వస్తుంటుంది. కీళ్ల నొప్పుల నుంచి తేరుకోవాలంటే నెయ్యి, నల్లమిరియాలు సేవిస్తే ఉపశమనం లభిస్తుంది.
ఇందుకోసం మిరియాలను వేయించి నెయ్యితో తీసుకోవాలి. ఈ మిశ్రమం చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలోనూ సహాయపడుతుంది.