తరుచూ ఈ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. క్యాన్సర్ కావచ్చు..

25 August 2023

కొన్ని రకాల నొప్పులు చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శరీరంలో కనిపించే కొన్ని నొప్పులు క్యాన్సర్‌కు సంకేతం కావచ్చని హెచ్చరిస్తున్నారు.

ఇంతకీ ఏయే ప్రాంతాల్లో వచ్చే నొప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అన్న వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నిరంతరం తలనొప్పి, స్పృహకోల్పోవడం, చేతులు, కాళ్లలో స్పర్శకోల్పోవడం, శక్తి తగ్గడం వంటి వస్తే ఇది బ్రెయిన్‌ ట్యూమర్‌కు ముందస్తు సూచనలు కావచ్చు.

ఛాతీలో విపరీతంగా నొప్పి ఉండడం, నిరంతంర దగ్గు, ఊపిరి ఆడకపోవడం లాంటి సమస్యలు ఉంటే ఉపిరిత్తుల క్యాన్సర్‌కు సంకేతాలు కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

రొమ్ము ప్రాంతంలో నొప్పి ఉండడం, ఆకారంలో మార్పు కనిపించడం వంటివి బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు సంకేతమై ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఆహారం తీసుకున్న సమయంలో కడుపులో విపరీతమైన నొప్పి కలిగినా, ఉన్నపలంగా బరువు తగ్గడం, కడుపు ఉబ్బరం వంటివి స్టమక్‌ క్యాన్సర్‌కు లక్షణాలుగా చెబుతున్నారు.

మల విసజర్జన సమయంలో నొప్పిగా ఉండడం. మలంలో రక్తం రావడం, బరువు తగ్గడం వంటివి పెద్ద పేగు క్యాన్సర్‌కు లక్షణాలు కావొచ్చు.

మూత్ర విసర్జన చేసే టైంలో విపరీతంగా నొప్పి ఉంటే ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ అయుండొచ్చు. మూత్రంలో రక్తం రావడం యూరినరీ బ్లాడర్‌ క్యాన్సర్‌కు సూచిక కావొచ్చని చెబుతున్నారు.