ఈ ల‌క్ష‌ణాలు కనిపిస్తున్నాయా.. రక్తహీనత సమస్య కావచ్చు..

23 August 2023

ఐర‌న్ లోపంతో పాటు ఇత‌ర కార‌ణాల కార‌ణంగా ర‌క్త హీన‌త వ‌స్తుంది. మ‌రి ర‌క్త హీన‌త ఉన్న‌ట్లు ముందుగానే తెలిపే కొన్ని ల‌క్ష‌ణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ర‌క్త హీన‌త‌తో బాధ‌ప‌డే వారు శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు ప‌డుతుంటారు. కాసేపు న‌డిచినా వీరికి వెంట‌నే ఆయాసం వ‌స్తుంది.

ఈ స‌మ‌స్య ఎంత‌కీ త‌గ్గ‌క‌పోతే వెంట‌నే వైద్యుడిని సంప్ర‌దించి అవ‌స‌ర‌మైన ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.

శ‌రీరంలో ర‌క్తం త‌క్కువ‌గా ఉంటే ర‌క్త‌క‌ణాల సంఖ్య కూడా తగ్గుతుంది. ఈ కార‌ణంగా చ‌ర్మం రంగు మారుతుంది. ఇలా సడెన్‌గా మారితే అది ర‌క్త హీన‌తేన‌ని గుర్తించాలి.

ఎడ‌తెర‌పి లేకుండా ఛాతిలో నొప్పి అనిపిస్తే కూడా ర‌క్త హీన‌త కార‌ణమై ఉండ‌వ‌చ్చు. దీనికి కార‌ణంగా స‌రిప‌డ ర‌క్తం శ‌రీరంలో లేకపోవడమే.

ఆక్సిజన్ స‌ర‌ఫ‌రా చేసేందుకు గుండె ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది. ఇది చాతి నొప్పికి దారి తీస్తుంది. కాబ‌ట్టి చాతిలో నొప్పిఅనిపించిన వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించండి.

శ‌రీరం నిత్యం చ‌ల్ల‌గా ఉంటే శ‌రీరంలో స‌రిప‌డ ర‌క్తం లేన‌ట్లే. శ‌రీరంలో ర‌క్తం ఉంటే అన్ని భాగాల‌కు ఉష్ణం స‌రిగ్గా స‌ర‌ఫరా అవుతుంది. దీంతో శ‌రీరం వేడిగా ఉంటుంది.

త‌ర‌చూ త‌ల‌నొప్పిగా అనిపిస్తే కూడా ర‌క్త హీన‌తతో బాధ‌ప‌డుతున్న‌ట్లు అనుమానించాలి. ఎంత‌కీ త‌ల‌నొప్పి త‌గ్గ‌క‌పోతే వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించాలి.