లేట్‌నైట్ పార్టీలు, మందు, విందులతో ఎంజాయ్ చేసేవారు.. ఆ మర్నాడు హ్యాంగోవర్‌తో ఇబ్బంది పడుతుంటారు. అయితే, ఆల్కహాల్ తాగిన అందరికీ ఈ సమస్య రాదు. వచ్చినా ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది.
హ్యాంగోవర్‌ను తగ్గించుకునేందుకు ఏం చేయాలతో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. దీనిని సహజంగా తగ్గించుకోవడానికి ఇంట్లో కొన్ని చిట్కాలను ఫాలో అవ్వొచ్చు అంటున్నారు నిపుణులు.
హ్యాంగోవర్‌ని తగ్గించడంలో తేనె బాగా హెల్ప్ చేస్తుంది. తేనెతేనెలో జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా మార్చే పోషకాలు అధికంగా ఉంటాయి. తేనెను తీసుకోవడంతో శరీరంలో ఆల్కాహాల్ తాగడంతో జరిగిన ఎఫెక్ట్స్ తగ్గుతాయి. వివిధ పదార్థాల్లో తేనె కలుపుకొని తీసుకుంటే మంచిది.
కొబ్బరి నీళ్లు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. కొబ్బరి నీళ్లలో ఉండే ఎలక్ట్రోలైట్ రిచ్ ఫ్లూయిడ్స్ హ్యాంగోవర్‌ను తగ్గిస్తాయి. శరీరంలో తగ్గిపోయిన న్యూట్రిషన్స్‌ను తిరిగి అందిస్తాయి. హ్యాంగోవర్ సమయంలో డీహ్రైడేషన్‌కు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి తరచూ నీళ్లు తాగుతూ ఉండటం మంచిది. హైడ్రేటెడ్‌గా ఉండడం వల్ల హ్యాంగోవర్ తగ్గుతుంది.. శరీరం నుంచి టాక్సిన్లు బయటకి పోతాయి. ఈ సమయంలో కూల్ డ్రింక్స్ తీసుకుంటే పరిస్థితి విషమిస్తుంది. కొబ్బరి నీరు వంటి ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే పానీయాలు హైడ్రేటెడ్‌గా ఉండడంలో హెల్ప్ చేస్తాయి.
నిమ్మకాయ అనేది హ్యాంగోవర్‌ను సులభంగా తగ్గిస్తుంది. నిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నిమ్మ టీ తాగడం లేదా నిమ్మరసం తాగడంతో హ్యాంగోవర్ తగ్గుతుంది. అరటి పండు కూడా హ్యాంగోవర్‌లో ఉపయోగపడుతుంది. అరటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని అందిస్తాయి.
అరటి తింటే మైకము, అలసట తగ్గుతుంది. హ్యాంగోవర్‌కు మజ్జిగ కూడా మంచి మందులా పనిచేస్తుంది. మజ్జిగలో పోషకాలు అధికంగా ఉంటాయి. మజ్జిగ తాగితే హ్యాంగోవర్ తగ్గుతుంది. ఆల్కాహాల్ తాగితే శరీరం డీ హైడ్రేట్ అవుతుంది. మజ్జిగ తాగితే హైడ్రేట్‌గా ఉంచుతుంది.
హ్యాంగోవర్‌తో ఇబ్బంది పడుతున్నప్పుడు పుదీనా వాడకం కూడా మేలు చేస్తుంది. పుదీనా కడుపును శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. పుదీనాను వివిధ రూపాల్లో తీసుకుంటే కడుపులోని అదరపు గ్యాస్ తొలగుతుంది.
హ్యాంగోవర్ సమయంలో గుడ్లు తినడం కూడా మంచిది. గుడ్లలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. గుడ్లలోని ప్రోటీన్లు టాక్సిన్లను తొలగిస్తాయి. హ్యాంగోవర్‌ను కంట్రోల్ చేస్తాయి.