నాడీ శోధన ప్రాణాయామంతో మీ ఆరోగ్యం పదిలం.. 

10 December 2024

TV9 Telugu

నాడీ శోధన ప్రాణాయామం కోసం ముందుగా పద్మాసనంలో కూర్చుని శ్వాసమీద దృష్టి పెట్టాలి. కొని నిమిషాల పాటు సాధారణ శ్వాస తీసుకోవాలి.

అనంతరం గయన్ ముద్ర అంటే కుడి లేదా ఎడమ చేతి చూపుడు వేలుతో బొటవేలి కులపుతూ.. మిగిలిన మూడు వేళ్ళను దూరం ఉంచి ముక్కును పట్టుకోవాలి.

ఒక ముక్కు రంధ్రాన్ని చేతి వేళ్ళతో మూసి.. రెండో ముక్కు రంధ్రంతో దీర్ఘ శ్వాస తీసుకోవాలి. నిధానంగా శ్వాసని తీసుకుంటూ పొట్టని బిగపట్టాలి.

అనంతరం శ్వాసను నియంత్రిస్తూ.. ఒక పది నెంబర్లు లెక్కపెట్టుకుని అపుడు నెమ్మదిగా శ్వాసను నెమ్మదిగా వదిలివేయాలి.

ఇదే విధానంలో రెండు ముక్కు రంధ్రాల నుంచి ఒకదాని తర్వాత ఒకటి గాఢంగా శ్వాస తీసుకుని.. నెమ్మదిగా వదలడం చేయాలి.

ఇలా ఉదయమే రోజూ ఐదు నుంచి ఆరు సార్లు చేస్తే ఆరోగ్యానికి మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు యోగాసన నిపుణులు.

ఇది శరీరంలోని కండరాలకు, ఊపిరితిత్తులకు మంచి ఎనర్జీని ఇస్తుంది. శ్వాస సంబంధిత సమస్యలు నివారింపడతాయి. టైడల్ వాల్యూమ్ పెరుగుతుంది.

నాడీవ్యవస్థను బలంగా తయారు చేస్తుంది. మానసిక ప్రశాంతను ఇస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. శరీరంలోని అవయవాలకు ఉత్తేజాన్ని ఇస్తుంది.

నాడీ శోధన ప్రాణాయామం మెదడులోని హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతుంది.