ఉల్లిపాయ మొలకలను ఉల్లికాడలు అని అంటారు. ఉల్లిపాయల్ని వాడలేని వారికి తక్కువ ఘాటుతో, మంచి రుచితో ఉండే ఉల్లికాడలు సరైన ప్రత్యామ్నాయం.
ఉల్లికాడల్లో పీచు పదార్ధం ఎక్కువ. తరచుగా తినేవారిలో బరువు సమస్య ఏర్పడదు. ఇంకా మలబద్ధక సమస్య కూడా ఉండదు.
పైల్స్ సమస్యతో ఇబ్బందిపడేవారు ఒక చిన్న బౌల్‌లో కొద్దిగా పెరుగు వేసుకుని అందులో ఉల్లికాడ ముక్కలను కలిపి.. రోజుకి రెండుసార్లు తింటే పైల్స్ సమస్య తగ్గుతుంది.
ఉల్లికాడల్లోనే సల్ఫర్ అధికం. దీంతో తరచుగా తినే ఆహారంలో చేర్చుకుంటే కొలెస్ట్రాల్‌ను, హైబీపీని అదుపులో ఉంటాయి.
జలుబు, దగ్గుతో ఇబ్బంది పడేవారికి ఉల్లికాడల సూప్ దివ్య ఔషధం. ఉల్లికాడల సూప్ తాగితే దగ్గు జలుబు నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
జలుబు, దగ్గుతో ఇబ్బంది పడేవారికి ఉల్లికాడల సూప్ దివ్య ఔషధం. ఉల్లికాడల సూప్ తాగితే దగ్గు జలుబు నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
ఉల్లికాడల్లో ఉండే పెక్టిన్ అనే పదార్థం ఉంది. దీంతో పెద్ద పేగు దెబ్బ తినకుండా, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారిస్తుంది.
ఉల్లికాడలను ఎక్కువగా వాడితే రక్తపోటూ, ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. ఉల్లికాడలు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి.