ఈ ఆయుర్వేద చిట్కాలతో చర్మ సమస్యలు దూరం..
22 August 2023
వేపతో ఎన్నో లాభాల ఉన్న విషయం తెలిసిందే. వేపచెట్టు చర్మరోగాలకు మంచి మెడిసిన్. వేప బెరడు కషాయం సేవిస్తే చర్మరోగాలు నయమవుతాయి.
మెట్టతామర ఆకు పసర, నిమ్మకాయ రసం కలిపి ఈ మిశ్రమాన్ని చర్మం పై అప్లై చేస్తే.. సాధారణ చర్మరోగాలు నయమవుతాయి.
వామింట చెట్టుని నీటితో కలిసి నూరి ముద్దచేసి దానిని నువ్వుల నూనె లో ఉడికించి ఆ నూనెని చర్మంపై రాస్తే.. చర్మరోగాలు నివారింపబడతాయి.
జిల్లేడాకు రసం, ఆవనూనె, పసుపు కలిపిన ఈ మిశ్రమం కూడా మంచి మందు. పచ్చగన్నేరు వేరు పైన చర్మం నేతిలో వేసి వేడి చేసి.. ఆ తైలం కూడా మంచి ఔషధం.
నేలవేము కషాయం తాగినా చర్మరోగాలు తగ్గుతాయి. మోదుగ విత్తనాలను తీసుకుని నిమ్మరసంతో కలిపి అరగదీసిన దురద దద్దుర్లపై బాధపడేవారి రాస్తే విముక్తి కలుగుతుంది.
నల్ల ఉమ్మెత్త రసం రాసిన చర్మరోగాలు నయం అవుతాయి. కొబ్బరినూనెలో గంధం పొడిని కలిపి ఆ మిశ్రమాన్ని అప్లై చేస్తే.. చర్మ రోగాలు నివారింపబడతాయి.
ఎర్రగన్నేరు వేరు నేతిలో వేసి మరిగించి ఆ నూనె కూడా చర్మ రోగాలను నివారిస్తుంది. గజ్జి, చిడుము వంటి చర్మరోగాలు నివారణకు కసివిందాకు రసం మంచి మెడిసిన్.
పనస ఆకులు కూడా చర్మవ్యాధులను నివారిస్తుంది. తాటి కల్లుతో బియ్యపు పిండి కలిపి పులియబెట్టి రాసినా దూరదతో ఉండే చీముపొక్కులు తగ్గుతాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి