రెడ్ మీట్ అధిక వినియోగం వల్ల దుష్ప్రభావాలు..

10 August 2023

మటన్ లేదా చికెన్‌ రోగనిరోధక వ్యవస్థని బలపరుస్తాయి. మాంసం పరిమితంగా తినడం వల్ల శరీరం బాగా అభివృద్ధి చెందుతుంది.

కానీ అతిగా తింటే మాత్రం చాలా అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని మాంసాహారాల్లో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. ఫలితంగా చెడు కొలెస్ట్రాల్ పెరిగి కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం ఉంది.

ముఖ్యంగా ఎర్ర మాంసం ఆరోగ్యకరమైన ఎముకలకు అవసరమైనప్పటికీ, దానిని ఎక్కువగా తినడం వల్ల ఎముకలు దెబ్బతింటాయని అధ్యయనాల్లో తేలింది.

అయితే పోషకాహార నిపుణులు మాత్రం అతిగా ప్రాసెస్ చేసిన మాంసాన్ని తీసుకుంటే ఎముకలు బలహీనం అవుతాయని చెబుతున్నారు.

అధిక ప్రోటీన్ ఆహారం, ముఖ్యంగా రెడ్ మీట్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఫలితంగా ఎముకలు బలహీనపడతాయి.

మాంసం అధిక ఫాస్పరస్-కాల్షియం నిష్పత్తిని కలిగి ఉంటుంది. ఇది మూత్రం ద్వారా కాల్షియం విసర్జనను పెంచుతుంది. ఇది ఎముకలో పోషకాలు తగ్గిపోయేలా చేస్తుంది.

ముఖ్యంగా ఎర్ర మాంసం కారణంగా రక్తం ఆమ్లంగా మారుతుంది. దీని కారణంగా ఎముకల నుండి కాల్షియం తొలగించబడుతుంది.