చేపలను ఇష్టంగా తింటున్నారా.. ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
29 August 2023
నీటిలో ఉండే పాదరసం, పీసీబీ వంటి రసాయనాలు కూడా చేపల కడుపులోకి వెళ్తాయి. మెర్క్యురీ, పిసిబిలు మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.
పెద్ద పరిమాణంలో చేపలను తింటే అది శరీరంలో పాదరసం, పీసీబీ మొత్తాన్ని పెంచుతుంది. దీంతో అనారోగ్యానికి గురయ్యే అవకాశముంది.
చేపలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో పాదరసం లేదా పిసిబి పరిమాణం పెరిగితే.. అది మెదడు లేదా నాడీ వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది.
దీని వల్ల మతిమరుపు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కావున పరిమిత పరిమాణంలో చేపలను తీసుకోవడం మంచిదని పేర్కొంటున్నారు నిపుణులు.
శరీరంపై చేపల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. చేపలు ఎక్కువగా తింటే వేడి చేస్తుంది. కావున గర్భిణిలు కూడా పరిమిత పరిమాణంలో చేపలను తినడం మంచిది.
గర్భిణీలు చేపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశముందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
పరిమిత పరిమాణంలో చేపలు తినడం తల్లి, బిడ్డకు ఉపయోగకరమే కానీ.. తినేముందు వైద్యుడిని లేదా నిపుణుడిని సంప్రదించడం మంచిది.
చేపలు ఎక్కువగా తినే వారి శరీరంలో అధిక మొత్తంలో పీసీబీ ఉంటుంది. ఈ వ్యక్తులు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి