దోసకాయ అధిక వినియోగం వల్ల దుష్ప్రభావాలు..
14 August 2023
రాత్రిపూట దోసకాయలను అస్సలు తినకూడదు.. పడుకోవడానికి కనీసం 3, 4 గంటల ముందు దోసకాయలను తింటే పర్లేదు.
కానీ పడుకునే ముందు అస్సలు తినకూడదు. ఎందుకంటే ఆహారం తిన్న తర్వాత దోసకాయ తింటే తొందరగా జీర్ణం కాదు.. దీంతో నిద్రపై ప్రభావం చూపిస్తుంది.
విటమిన్ కే.. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే దోసకాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కిడ్నీ సమస్యలను తగ్గిస్తాయి.
అయితే అతిగా తినడం వలన శరీరంలోని అదనపు ద్రవాన్ని బయటకు పంపిస్తాయి. దీంతో డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంటుంది.
సెన్సిటివ్ పొట్ట ఉన్నవారు దోసకాయలు తినడం ప్రమాదమే.. ఎందుకంటే ఇందులో ఉండే కుకుర్బిటాసిన్ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది.
దీంతో జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే గ్యాస్ట్రైటిస్, గ్యాస్ సమస్యలు వస్తాయి. సైనస్ ఉన్నవారు దోసకాయలకు దూరంగా ఉండాలి.
అలాగే శ్యాసకోశ సమస్యలు ఉన్నవారికి కూడా దొసకాయ మంచిది కాదు. చర్మ సమస్యలు ఉన్నవారు దోసకాయలను తినకూడదు.
దోసకాయ చర్మ అలెర్జీలను కలిగిస్తుంది. దీంతో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. దోసకాయలు నీళ్లు కలిపి అస్సలు తీసుకొవద్దు దోసకాయ తిన్న వెంటనే నీరు తాగకూడదు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి