నిద్రపోయేముందు పండ్లు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు..

29 JULY 2023

మనం నిద్రకు ఉపక్రమించే సమయంలో ఆకలిగా ఉందనే సాకుతో కచ్చితంగా పండ్లు తినడానికి ఉత్సాహం చూపుతాం.

అయితే నిపుణులు మాత్రం అది చాలా చెడ్డ అలవాటని చెబుతున్నారు.

పడుకోడానికి ముందు 2-3 గంటల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకూడదని సూచిస్తున్నారు.

నిద్రపోయే ముందు పండ్లు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుందని వివరిస్తున్నారు.

అలాగే పండ్లల్లో ఉన్న చక్కెర, శరీరంలోకి చక్కెర స్థాయి హెచ్చుతగ్గుల వల్ల ఇబ్బందిని ఎదుర్కొంటామని పేర్కొంటున్నారు.

మనలో చాలా మంది చేసే తప్పు పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగము.

అయితే నారింజ, పుచ్చకాయ, సీతాఫలం, స్ట్రాబెర్రీ వంటి అధిక నీటి శాతం ఉన్న పండ్లను తిన్నప్పుడు కచ్చితంగా నీటి తాగాలి.

ఇలా చేయడం ద్వారా కడుపులో ఆమ్లత్వం తగ్గి ఇతర అనారోగ్యాలకు గురికాకుండా సాయం చేస్తుంది.