పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లు తాగుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..

19 August 2023

పుచ్చకాయ దాహాన్ని తీరుస్తుంది. ఇందులో విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి.  డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. చర్మాన్ని పొడిబారకుండా హైడ్రేట్‏గా ఉండేలా చేస్తుంది.

పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు అని అంటుంటారు. పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగితే పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని పెద్దలు అంటుంటారు.

పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లు తాగితే ప్రమాదమే అంటున్నారు నిపుణులు. ఎందుకో వచ్చే సమస్యలు ఏంటో తెలుసుకుందాం.

పుచ్చకాయలో 6 శాతం చెక్కర ఉంటుంది. అలాగే 92 శాతం నీరు ఉంటుంది. అంటే నీరు శాతం పుచ్చకాయలో ఎక్కువగా ఉంటుంది.

ఇది తిన్న వెంటనే నీళ్లు తాగితే వాటర్ కంటెంట్ పెరిగి వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే డీహైడ్రేట్ సమస్య కలుగుతుంది.

పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లు తాగితే శరీరం బరువెక్కడంతోపాటు జీర్ణక్రియ నెమ్మదిగా ప్రారంభమై చక్కెరను జీర్ణంచేయడానికి ఇబ్బంది కలుగుతుంది.

కడుపు నొప్పి సమస్య ఉన్నవారు పుచ్చకాయ తిని వెంటనే నీరు తాగితే వికారం కలుగుతుంది. ఫలితంగా బలహీనంగా ఉంటారు.

పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగడం వలన శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవుతాయి. పుచ్చకాయ, నీరు కలిపి తీసుకుంటే.. శరీరంలోని కణాల పనితీరు తగ్గిపోతుంది.