ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటే ప్రమాదంలో పడినట్లే..

20 August 2023

మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ యాంత్రిక జీవితంలో ఆహారపు అలవాట్లలో బాగా మార్పులు వచ్చాయి.

ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తింటున్నారు. ఇదే క్రమంలో కొందరు ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటుంటారు.

పరగడుపునే తీసుకునే ఫుడ్స్‌ విషయంలో జగ్రత్త లేకపోతే జీర్ణ సంబంధిత సమస్యలు తప్పవు. ముఖ్యంగా కొన్ని ఫుడ్స్‌ను దూరం పెట్టాలి. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

ఖాళీ కడుపుతో పండ్ల రసాలు తీసుకోవడం వల్ల ప్యాంక్రియాస్‌పై అదనపు భారం పడుతుంది. ఇక పండ్లలో ఉండే చక్కెర కాలేయంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

బేరి, నారింజ వంటి సిట్రస్ పండ్లు పొట్టలో యాసిడ్ స్థాయులను పెంచుతాయి. ఫలితంగా పొట్టలో పుండ్లు, గ్యాస్ట్రిక్ అల్సర్ల ప్రమాదం పెరుగుతుంది.

ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్థాయులు పెరుగుతాయి. దీనివల్ల పొట్టలో పుండ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.

పెరుగు వంటి పులియబెట్టిన పాల ఉత్పత్తులను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్ల స్థాయులు పెరుగుతాయి.

సలాడ్ ఖాళీ కడుపుతో తీసుకుంటే అపానవాయువు అలాగే కడుపు నొప్పికి కారణమవుతుంది. దీనిని ఖాళీ కడుపుతో తీసుకుంటే ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.