చికెన్ అధికంగా తినడం వల్ల దుష్ప్రభావాలు..

02 September 2023

ఇంట్లో చేసుకునే వంటకాల నుంచి బయటి హోటల్, రెస్టారెంట్ల వరకు చికెన్ దే అగ్రస్థానం. చికెన్ లో ఎన్నో వెరైటీలు ఉన్నాయి.

చికెన్ తినడం వల్ల ఆరోగ్యాన్ని ప్రయోజనమే అయినప్పటికీ అధికంగా తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

చికెన్‌లో ఉండే ప్రొటీన్‌, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోగనిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది. ఇది తింటే ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

కండరాల పెరుగుదలకు చికెన్ బెస్ట్ ఫుడ్ గా చెప్పవచ్చు. అయితే చికెన్‌ ఎక్కువగా తింటే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

రోజూ చికెన్ తినడం వల్ల, చికెన్ కొనేటప్పుడూ, వండేటప్పుడూ జాగ్రత్త. చికెన్ లో ఉండే సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఫుడ్ పాయిజనింగ్ దారి తీసే అవకాశం ఉంది,

చికెన్‌ ఎక్కువగా తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ లెవెల్స్ పెరుగుతాయని తేలింది. ఫలితంగా గుండె సమస్యలు, హైపర్‌టెన్షన్‌, స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉంది.

అయితే ప్రతిరోజూ చికెన్‌ తినడం వల్ల బరువు పెరిగే ఆస్కారం ఉంది, ఫుడ్ డైట్ మెయింటేనే చేసే వారు చికెన్ తక్కువగా తీసుకోవడమే మంచిది.

డైరీ ప్రొడక్ట్స్, రెడ్‌ మీట్‌, చికెన్‌ స్కిన్‌‌లో ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని తక్కువగా, కావాల్సినంత మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.