కొబ్బరి నీళ్లు అధికంగా సేవించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు..
22 August 2023
కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ శరీరంలో నీటి శాతాన్ని పెంచుతాయి. అలాగే సరైన సమయంలో కాక ఇతర సందర్భాల్లో కొబ్బరి నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.
అలాగే జలుబు ఉన్నవారు రాత్రిళ్లు కొబ్బరి నీళ్లు అస్సలు తాగకూడదు. అలాగే కడుపులో సమస్యలు ఉన్నవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగకూడదు.
కొబ్బరి నీళ్ల శరీరంలో నీటి పరిమాణాన్ని పెంచుతుంది. అంతేకాకుండా విరేచనాలు కలుగుతాయి. అందుకే ఎక్కువ తాగకూడదు.
కొందరికి ప్రతిసారి జలుబు చేస్తుంటుంది. చల్లటి పదర్థాలు తింటే జలుబు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి సందర్బంలో కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగకూడదు.
వాస్తవానికి కొబ్బరి నీళ్ల ప్రభావం చల్లగా ఉంటుంది. దీంతో జలుబు సమస్య మరింత తీవ్రతరమవుతుంది. మోతాదులో తాగడం మంచిది.
ఇక అధిక రక్తపోటుకు మందులు వాడేవారు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగకూడదు. ఇందులో రక్తపోటును తగ్గించే గుణాలు ఉన్నాయి.
పొట్ట ఉబ్బరం సమస్యతో బాధపడేవారు కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్లు తాగకూడదు. కొబ్బరి నీళ్లు తాగాలనుకుంటే ముందుగా వైద్యుడి సలహాలు తీసుకోవాలి.
దీంతోపాటు.. ఏదైనా శస్త్రచికిత్స జరిగిన తర్వాత శస్త్రచికిత్స తర్వాత కొబ్బరి నీళ్లు తాగడం మానుకోవాలి. ఇది రక్తపోటును నియంత్రించడంలో సమస్యలు కలిగిస్తుంది.