రోజూ ఇలా చేస్తే మృదువైన పింక్ లిప్స్ మీ సొంతం..

12 August 2023

లిప్‌ స్క్రబ్ పెదవులపై ఉన్న డెడ్ స్కిన్‌ను తొలగించేందుకు.. తేనె, బాదం నూనెను సమాన పరిమాణంలో కలుపుకుని దానిలో కొంచెం చక్కెర వేసి బాగా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని పెదవులపై అప్లై చేసి నెమ్మదిగా స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం మూలంగా పెదాలు మృదువుగా మారి, క్రమంగా లేత పింక్‌ కలర్‌లోకి మారుతాయి.

శరీరానికి, చర్మానికి పోషణ ఎంత అవసరమో, పెదాలకు కూడా అంతే అవసరం. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు పెదాలకు అలోవెరా జెల్ రాసి మసాజ్ చేసుకోవాలి.

తర్వాత నాణ్యత కలిగిన మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ను అప్లై చెయ్యాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే పెదవులు ఆరోగ్యంగా ఉంటాయి.

నిద్రపోయేముందు క్రీమ్ రాసుకోవడం వల్ల పెదాల రంగుపై చాలా ప్రభావం చూపుతుందని సౌందర్య నిపుణులు అంటున్నారు.

రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండడం వల్ల చాలా పెదవులు ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి నీరు అధికంగా తాగడం అలవాటు చేసుకోవాలి.

పొగతాగే అలవాటున్నవారు వెంటనే మానేయడం బెటర్‌. లేకపోతే మీ సమస్య ఎప్పటికీ సమస్యగానే మిగిలిపోతుంది.

కెమికల్ ఉపయోగించని  నాణ్యమైన లిప్‌స్టిక్‌లను ఎంపిక చేసుకోవడం మర్చిపోకూడదు. ఇలాంటి సౌందర్య సాధనాలు మార్కెట్ లో చాల ఉన్నాఉన్నాయి.