ఈ చెట్టు ఓ ఔష‌ధ బండాగారం.. దీనితో అనేక సమస్యలు దూరం..

28 August 2023

క‌సివింద‌ ఆకులలో బోలెడు ఔషధగుణాలు దాగి ఉన్నాయి. ఈ ఆకులతో నాడీ నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యానికి మేలు.

దీనితో ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ ఆకుకూర వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఎన్నో ఔష‌ధ‌ గుణాలున్న చెన్నంగిలో చిన్న క‌సివింద‌, పెద్ద క‌సివింద అని రెండు ర‌కాల చెట్లు ఉంటాయి. దీనిని ఉప‌యోగించి క‌డుపులో వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌వ‌చచ్చు.

ఈ చెట్టు ప్రతిభాగం ఎన్నో ఔష‌ధ గుణాలను క‌లిగి ఉండి మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది.

క‌సివింద చెట్టు ర‌సం చేదుగా ఉండి వేడిని క‌లిగిస్తుంది. వాతాన్ని, విషాన్ని హ‌రించే శ‌క్తి ఈ క‌సివింద చెట్టుకు ఉంది. గాయాల‌ను, వ్ర‌ణాల‌ను, చ‌ర్మ రోగాల‌ను న‌యం చేస్తుంది.

క‌సివింద చెట్టు ఆకుల‌ను వెన్న‌తో నూరి చ‌చ్చుబ‌డిన ప‌క్ష‌వాత భాగాల‌పైన ప్ర‌తిరోజూ మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల అవి పూర్వ స్థితికి చేరుకుంటాయి.

క‌సివింద ఆకుల‌ను, వేరు బెర‌డును ఎండ‌బెట్టి పొడిలా చేసుకుని తేనెను క‌లిపి లేప‌నంగా రాసుకోవ‌డం వ‌ల్ల అనేక ర‌కాల చ‌ర్మ వ్యాధులు, గాయాలు, వ్ర‌ణాలు త‌గ్గుతాయి.

క‌సివింద గింజ‌ల‌ను దోర‌గా వేయించి పొడిలా చేసి క‌షాయంలా చేసుకుని అందులో త‌గిన‌న్ని పాలు, కండ‌చ‌క్కెర క‌లిపి కాఫీ లా తాగుతూ ఉంటే స‌మ‌స్త మూత్ర రోగాలు త‌గ్గుతాయి.