ఈ టిప్స్‎తో రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ మాయం.. 

TV9 Telugu

24 November 2024

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ ఎక్కువైతే రక్తనాళాలు మూసుకుపోయి గుండెకు, మెదడుకు ధమనులందు అవరోధం కలిగిస్తుంది.

అధిక చెడు కొలెస్ట్రాల్ సమస్య నుండి బయటపడే చిట్కాలు మీ ఇంట్లో ఉన్న వంటగదిలో ఉందంటున్నారు వైద్య నిపుణులు.

వంటగదిలో ఉండే కొన్ని మసాలాలు, ఆహారాలు కొలెస్ట్రాల్ స్థాయిలను వేగంగా తగ్గించి, గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి అవిసె గింజలను దివ్యౌషధంగా పనిచేస్తాయంటున్నారు అరోగ్య నిపుణులు.

ఫ్లాక్స్ గింజలను పొడి చేసి ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో 1 టీస్పూన్ పొడిని తీసుకోండి.

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడిని నీటితో తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది.

కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వ్యక్తులు ప్రతి రోజు 2 యాపిల్ పండ్లను తీసుకుంటే, కొలెస్ట్రాల్ 50 శాతం తగ్గించవచ్చంటున్నారు డాక్టర్స్.

వెల్లుల్లిని పచ్చిగా కానీ.. ఉడికించి తీసుకుంటే ఎంతో ప్రయోజనం.. క్యాప్సూల్ లేదా టాబ్లెట్ రూపంలో కూడా లభిస్తుంది.