చల్లగా ఉన్నా ఎక్కువగా చమట పడుతుందా.. ఈ సమస్యలే కారణం కావచ్చు..

26 August 2023

చెమట అనేది మన చర్మంలో ఉంటే శ్వేధగ్రంధాల నుంచి విడుదలయ్యే శరీర ద్రవం. శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, శరీరం చల్లబరచడానికి చెమట పడుతుంది.

వ్యాయామం చేస్తున్నప్పుడు, ఎండలో నడిచేటప్పుడు చెమటలు పట్టడం సాధారణం. ఈ పరిస్థితులకు దూరంగా ఉన్నా చెమట పడితే దానిని తీవ్రంగా పరిగణించాలి.

అధికంగా చెమట పట్టడం అనేది మీ శరీరంలో ఏదో లోపం ఉందని సూచిస్తుంది. ఎక్కువగా చెమట పట్టడానికి గల కారణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

దీంతో వెంటనే చికిత్స తీసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఎక్కువగా చెమట పట్టడానికి గల కారాణాలు, వచ్చే వ్యాధుల గురించి ఇప్పుడు తెలుసుకోండి.

ఒక వ్యక్తి తన శరీరంలో తగినంత గ్లూకోజ్ ఉత్పత్తి చేయనప్పుడు మధుమేహం వస్తుంది. ఇది తగినంత పరిమాణంలో లేకపోతే మీ శరీరం సరిగ్గా పనిచేయదు.

ఈ సమస్య ఉన్న వ్యక్తికి అవసరానికి మించి చెమట పడుతుంది. అటువంటి పరిస్థితిలో చిరాకు లేదా గందరగోళం, అలసట లాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

థైరాయిడ్ గ్రంధి థైరాక్సిన్ అనే హార్మోన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసినప్పుడు హైపర్ థైరాయిడిజం వస్తుంది. దీని వల్ల వ్యక్తికి తీవ్రమైన చెమటలతో పాటు ఆకలి కూడా పెరుగుతుంది.

ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించి.. చికిత్స తీసుకోవడం మంచిది. ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదిస్తే పలు సమస్యల నుంచి బయటపడొచ్చు.