సమ్మర్‌లో తరచూ తలనొప్పి వస్తోందా.? నేచురల్ టిప్స్ ఇవిగో
Ravi Kiran
19 May 2025
వేసవిలో చాలామందికి తరచూ తలనొప్పి వస్తుంటుంది. అయితే, దానిని ట్రిగర్ చేసే అంశాలు ఏంటో తెలిస్తే, నివారణ ఈజీ అవుతుంది.
అందుకే సమ్మర్ ఎక్కువగా వచ్చే తలనొప్పికి గల కారణాలేంటో జాగ్రత్తగా గ్రహించినట్టయితే.. సమ్మర్‌లో ఎక్కువగా డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది
దానిని తగ్గించుకోవడానికి హైడ్రేటెడ్‌గా ఉండాలి. ఎక్కువ చెమట రావడం, ఫ్లూయిడ్స్ బయటకు వెళ్లడం వల్ల కూడా తలనొప్పి వస్తాయి.
నేరుగా సన్‌లైట్ పడడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. హీట్ రిలేటెడ్‌గా తలనొప్పి వస్తాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ డ్రాప్ అయినప్పుడు కూడా తలనొప్పి వస్తాయి.
సమ్మర్‌లో వేడి వల్ల నిద్ర సమస్యలు వస్తాయి. వీటివల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
సైనస్ సమస్య ఉన్నవారికి దుమ్ము, కాలుష్యం.. సమ్మర్‌లో గాలి వల్ల కూడా తలనొప్పి వస్తుంది. వేడి ఎక్కువగా ఉండడం వల్ల కొందరు కెఫిన్ తీసుకోవడం తగ్గిస్తారు.
దీనివల్ల కూడా తలనొప్పి వస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉంటే కూడా తలనొప్పి వస్తుంది.