శరీరం వేడి చేస్తుంటే పరగడుపున అలోవెరా జ్యూస్ తీసుకోవాలి ఇలా చేయడం వల్ల వేడి తగ్గి, చలవ చేస్తుంది. ప్రతీరోజూ జ్యూస్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
సమ్మర్‌లో వేడిని తగ్గించడంలో బార్లీ నీళ్లు కూడా ఎంతో ఉపయోగపడతాయి. రెండు పూటలా ఈ నీటిని తీసుకుంటే వేడి నుంచి ఉపశమనం పొందొచ్చు.
వేసవిలో గంటకోసారి నీళ్లు తాగడాన్ని కచ్చితంగా అలవాటుగా మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి.
ఇక కొబ్బరి నీరు కూడా శరీరాన్ని వేడి నుంచి కాపాడుతుంది. కాబట్టి సమ్మర్‌లో తరచూ కొబ్బరి నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు.
సమ్మర్‌లో కీరదోసను నేరుగా తిన్నా, జ్యూస్ రూపంలో తాగినా వేడి నుంచి తప్పించుకోవచ్చు. ఇందులోని నీటి శాతం శరీరానికి చలువ చేస్తుంది.
పుచ్చకాయ కూడా శరీరానికి చలువు చేస్తుంది. ఇందులో సుమారు 90 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూస్తుంది.
ఇక సమ్మర్‌లో మజ్జిగను కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగలో కొత్తమీర వేసుకొని తాగితే శరీరానికి చలువ చేస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.