తల్లిపాలే శిశువుకు అద్భుత ఔషధం.. అపోహలను వీడండి..

09 August 2023

శిశువు ఆరోగ్యానికి తల్లిపాలు ప్రకృతి ఇచ్చిన వరం. తల్లి కౌగిలిలో వెచ్చదనం, పాలలో కమ్మదనం పుట్టిన బిడ్డకు మంచి పోషణ ఇస్తుంది.

అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఇస్తే హానికరం అనే అపోహతో కొందరు తల్లులు ముర్రుపాలు ఇవ్వడం మానేస్తున్నారు.

ఒక దశలో తల్లిపాలకంటే, డబ్బాపాలే మంచివని  అని అస్సలు తల్లిపాలు కాకుండా డబ్బా పాలు బిడ్డకు పడుతున్నారు.

ప్రతితల్లి  డబ్బా పాలు మరిచి తల్లిపాలను మాత్రమే పట్టాలి. దీని వల్ల బిడ్డ ఆరోగ్యనికి మంచిందని నిపుణులు అంటున్నారు.

వందకుపైగా పోషకాలుండే పాలను బిడ్డకు ఎంత త్వరగా పట్టిస్తే అంత వేగంగా గర్భాశయ కండరాలు సాధారణ స్థితికి చేరుకుంటాయట.

ముఖ్యంగా బాలింతలను బాధించే అధిక రక్తస్రావం సమస్య కంట్రోల్ అవుతుందని ఆరోగ్య నిపుణులు పరిశోధనలో వెల్లడైంది.

కనీసం ఆరునెలలపాటు పిల్లలకు చనుపాలు పడితే  జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత ఇబ్బందులు దూరమవుతాయని అంటున్నారు.

తల్లిపాలలో ఉండే ఇమ్యూనోగ్లోబిన్లు, లాక్టోఫెరిస్‌, లాక్టోపెరాక్సీడేజ్‌లు శిశువును ఎన్నో రకాల రోగాల నుంచి కాపాడుతాయి.