వీటిలో నిమ్మరసం కలుపుతున్నారా.? సమస్యలకు మీరే బాధ్యలు..
27 November 2024
TV9 Telugu
మజ్జిగలో నిమ్మరసం కలిపి తాగడం ఆరోగ్యానికి హానికరమని, గుండెల్లో మంటగా అనిపించడం, వాంతులు కావడం లాంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
మసాలాతో చేసిన వంటకాల్లో కూడా నిమ్మరసాన్ని ఉపయోగించడం మానుకోవాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
బిర్యానీలు, ఇతర మసాలా ఆహారాల్లో ఘాటును భరించడం కోసం, పుల్లని రుచి కోసం చాలా మంది నిమ్మరసాన్ని పిండుకుంటారు.
మసాలాతో చేసిన బిర్యానీ లాంటి వాటిలో నిమ్మరసం వల్ల ఎసిడిటీ బారినపడే ప్రమాదం ఉందంటున్నారు పోషకాహార నిపుణులు.
ఎందుకంటే నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉండటమేగాక ఆ నిమ్మకాయ పిండుకోవడం వల్ల మసాలా ఘాటు కూడా తగ్గుతుంది.
దీని కారణంగా మసాలాతో చేసిన ఆహారాన్ని అతిగా తీసుకుంటాం. దింతో శరీరంలో ఎసిడిటీ పెరగడానికి కారణమవుతుంది.
అదే విధంగా రెడ్ వైన్ తీసుకునేటప్పుడు కూడా నిమ్మకాయను ఏ రూపంలోనూ తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.
నిమ్మ రసం వైన్ రుచిని, వాసనను చెడగొట్టడమేగాక ఆరోగ్యానికి హాని చేస్తుందంటున్నారు. శరీరంలో ఎసిడిటీని కలిగిస్తుందని చెబుతున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
శీతాకాలంలో అవిసె గింజల లడ్డుతో ఆ సమస్యలు దూరం..
వెన్ను నొప్పి వేధిస్తోందా.? ఈ పొరపాట్లే కారణం..
నల్ల నువ్వులతో అనారోగ్యానికి చరమగీతం..