పీసీఓఎస్.. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ప్రస్తుతం చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్లో అతి ముఖ్యమైంది. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు, ఇన్సులిన్ స్థాయులు పెరిగినప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది
TV9 Telugu
తద్వారా స్త్రీలలో నెలసరి సక్రమంగా రాకపోవడం, అధిక బరువు, మొటిమలు, సంతానలేమి, అవాంఛిత రోమాలు వంటి పలు సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి. పీసీఓఎస్ నయంకాకుంటే గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం.. వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి
TV9 Telugu
ఇందుకోసం డాక్టర్ సూచించిన మందులతో పాటు వ్యాయామం, సరైన పోషకాహారం.. వంటివి తప్పనిసరి. వీటితో పాటు ఇంట్లో దొరికే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలనూ ఉపయోగించడం వల్ల పీసీఓఎస్ నుంచి తొందరగా విముక్తి పొందచ్చని చెబుతున్నారు నిపుణులు
TV9 Telugu
ఫైబర్ అధికగా ఉండే తృణ ధాన్యాలు ఆహారంలో భాగంగా తీసుకోవాలి. అవిసె గింజలు కూడా ఒకటి. వీటిలో పీచు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో విడుదలైన గ్లూకోజ్, ఇన్సులిన్‌లను ఉపయోగించుకుని పీసీఓఎస్ ద్వారా తలెత్తే దుష్ప్రభావాలను తగ్గిస్తుంది
TV9 Telugu
అలాగే రాగుల్లో కాల్షియం, ఐరన్ వంటి మినరల్స్ ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువే. ఈ పదార్థాలన్నీ బరువును నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి
TV9 Telugu
రాగులలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నందున, రక్తంలో ఇన్సులిన్ సమతుల్యతను కాపాడడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. బరువు నియంత్రణ, ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా ఉంటే PCOS సమస్యలను తొలగించుకోవచ్చు
TV9 Telugu
జొన్నలు కూడా పీసీఒఎస్‌ని నియంత్రించడానికి ఇన్సులిన్ హార్మోన్ సమతుల్యతను కాపాడటంతో ఉపయోగపడతాయి. ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది. సులభంగా జీర్ణమయ్యే ఫైబర్ కూడా ఉంటుంది
TV9 Telugu
పీసీఓఎస్ సమస్య నివారణకు జొన్నలు చాలా మంచి ఆహారం. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇందులోని మెగ్నీషియం వంటి ప్రయోజనకరమైన మినరల్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి