మనం పట్టించుకోని ఈ లక్షణాలు.. క్యాన్సర్‌ లక్షణాలు కొవొచ్చు. 

17 october 2023

ఉన్నట్లుండి బరవు తగ్గుతుంటే వెంటనే అలర్ట్‌ అవ్వాలి. ఎలాంటి డైట్‌, వ్యాయామం చేయకుండా బరువు తగ్గితే క్యాన్సర్‌ లక్షణంగా భావించ్చు. కడుపు, లంగ్‌, అన్నవాహిక క్యాన్సర్‌ లక్షణాలుగా చెప్పొచ్చు. 

కొన్ని సందర్భాల్లో ఎడతెరపి లేని జ్వరం కూడా క్యాన్సర్‌కు లక్షణంగా చెబుతున్నారు. క్యాన్సర్‌ పుట్టిన నాటి నుంచి ఇతర అవయవాలకు వ్యాప్తిం చెందిన ప్రతీ సమయంలో జ్వరం వస్తూనే ఉంటుంది. 

విపరీతమైన అలసట కూడా కొన్ని సందర్భాల్లో క్యాన్సర్‌కు లక్షణంగా చెప్పొచ్చు. లుకేమియా లాంటి కొన్ని క్యాన్సర్స్‌లో అలసట తొలి లక్షణం ఇదే. పెద్దపేగు, కడుపు క్యాన్సర్‌ వంటివి అలసటకు కారణంగా మారుతాయంటున్నారు. 

ఇక చర్మ క్యాన్సర్‌ను కూడా కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. చర్మం ఉన్నట్లుండి నల్లగా లేదా ఎర్రగా మారడం. దురద బాగా పెరగడం, జుట్టు అసహజంగా రాలిపోవడం వీటి లక్షణాలుగా చెబుతున్నారు. 

దీర్ఘకాలంగా మలబద్ధకం, డయేరియాతో బధపడుతుంటే అది పెద్దపేగు క్యాన్సర్‌కు కారణంగా అనుమానించాలని నిపుణులు చెబుతున్నారు. మూత్రంలో నొప్పి రావడం, రక్తం పడడం వంటివి ప్రొస్టేట్ క్యాన్సర్‌కు లక్షణంగా చెబుతున్నారు.

గాయాలై ఎక్కువ కాలం మానకపోతే వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. నోటి క్యాన్సర్‌ ఉంటే నోట్లో పుండు కూడా త్వరగా మానదని నిపుణులు చెబుతున్నారు. 

ఒకవేళ మలంలో రక్తం పడితే పెద్దపేగు క్యాన్సర్‌కు సంకేతానికి కారణంగా చెప్పొచ్చు. మూత్రంలో రక్తం కిడ్నీ క్యాన్సర్‌, చనుమెనల నుంచి రక్తం వస్తే రొమ్ము క్యాన్సర్‌ లక్షణంగా చెప్పొచ్చు. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.