22 August 2023

కీళ్ల నొప్పులను తగ్గించగల మసాలాలు ఇవే..

ప్రస్తుత కాలంలో కీళ్ల నొప్పులతో చాలా మంది బాధపడుతున్నారు. ఇలాంటివారు సమస్య నుంచి ఉపశమనం కోసం వంటగదిలోని పదార్థాలను సరిగ్గా ఉపయోగిస్తే చాలు.

ఈ క్రమంలో మీరు ఆయా పదార్థాలను అనునిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. తద్వారా వాటిల్లోని పోషక గుణాలు మీ నొప్పులను నివారిస్తాయి.

వెల్లుల్లిలోని సల్ఫర్ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా దీనిలోని యాంటీఆక్సిడెంట్లు కీళ్ల నొప్పులను పూర్తిగా నివారిస్తాయి.

అల్లం శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు ప్రతి నిత్యం అల్లం టీ తాగితే కీళ్ల నొప్పులు మాయమవుతాయి.

పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇందు కోసం మీరు పసుపు టీ, పసుపు పాలు తాగితే చాలు.

యాలకులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు ఇందుకు సహాయపడతాయి.

దాల్చిన చెక్క కూడా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించగలదు. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ఆ శక్తి ఉంది.

మిరియాల్లో అధికంగా ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పిని నివారిస్తాయి. అలాగే రానున్న కాలంలో మళ్లీ ఈ నొప్పులు రాకుండా నిరోధిస్తాయి.