పసుపు ఎక్కువగా వాడితే ఆ సమస్యలు మీ చెంతనే..
28 May 2025
Prudvi Battula
పసుపులో ఎన్నో ఔషధ గుణాలున్నాయనే విషయం దాదాపు అందరికి తెలిసిందే. పసుపు ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఎన్నో రకాల ప్రయోజనాలను కల్పిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెంచడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఇప్పటికే వైద్య నిపుణులు వెల్లడించారు.
అయితే పసుపును అతిగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపులో ఆక్సలేట్ ఉంటుంది. దీంతో మీరు పసుపును అధికంగా తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లకు కారణం కావచ్చు.
ఏదైనా ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
మీరు ఒక రోజులో 1 టీస్పూన్ కంటే ఎక్కువ పసుపు తీసుకుంటే కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు వంటి సమస్యలను వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
పసుపును అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది. అసలైన పసుపు అధిక వినియోగం శరీరంలో ఐరన్ సమస్య ఏర్పడేలా చేస్తుంది.
ఈ కారణంగా మీ శరీరంలో రక్తం నిల్వ తగ్గిపోయే ప్రమాదం ఉందంటున్నారు. అందకే పసుపు మోతాదులో తీసుకోవడం చాల మంచిది.
మరిన్ని వెబ్ స్టోరీస్
మాన్సూన్ వేళా ఈ ప్రదేశాలు అద్భుతం.. ఒక్కసారైన చూడాలి..
విశ్వంలో బ్లాక్ హోల్ ఏర్పడేది ఇలానే..
సూర్యోదయం చూడాలంటే ఈ ప్రదేశాలు మంచి ఎంపిక..