ఆవాలు ఇలా తీసుకుంటే ఈ సమస్యల నుంచి ఉపశమనం..

ఆవాల తీసుకొంటే జీర్ణశక్తి, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి.

ఒక టీ స్పూన్ ఆవాల పొడిని తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

అలాగే పేగుల్లో పెరిగిపోయిన మలం తేలికపడి మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి.

శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి ఆవాల పొడి చక్కగా పనిచేస్తుంది.

ఆవాల ముద్దలో కర్పూరము కలిపి ఆ మిశ్రమాన్ని కీళ్ళ నొప్పులకు రాస్తే..ఉపశమనం కలుగుతుంది.

జ్వరం ఉన్నప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాసు నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి.

ఇలా మరుగుతున్న నీటిలో చిటికెడు ఆవాల పొడి కలపాలి.

స్టవ్ ఆఫ్ చేసి ఈ నీటిలో తేనె వేసుకుని తాగితే జ్వరం తగ్గుతుంది.