సొరకాయ తీసుకుంటే అనారోగ్యం ఆమడ దూరం..
TV9 Telugu
21 January
202
5
సొరకాయలో విటమిన్లు, తక్కువ కేలరీలు, ఫైబర్, పొటాషియం, మినరల్స్, ప్రొటీన్లు నీటిశాతం వల్ల అజీర్ణ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
తరచు సొరకాయను తినడం వల్ల రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బీపీ ఉన్నవారికి ఇది ఉత్తమమైన ఎంపిక.
అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు సొరకాయ తినవచ్చు. ఇది తరచు తింటే బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
సొరకాయలో కాలరీలు, పీచుపదార్థాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు ఇది మంచి ఆహారం.
సొరకాయలో కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు మీ ఎముకలను బలోపేతం చేస్తాయి. గుండె ఆరోగ్యానికి కూడా ఇది ఉత్తమమైన ఆహారం.
సొరకాయలో మంచి పోషకాలు ఉండటం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి అధిక రక్తపోటును నివారించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. మారుతున్న జీవనశైలి కారణంగా, చాలా మంది ప్రజలు ఒత్తిడితో జీవిస్తున్నారు.
అధిక స్ట్రెస్ కారణంగా అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే సొరకాయ తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని కూడా ఆరోగ్య నిపుణులు చెబుతారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ట్రంప్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
మహాకుంభ మేళాకు వచ్చే భక్తులను ఎలా లెక్కిస్తారు..?
కొబ్బరి పిండి రోటీలు తెలుసా.? అనేక లాభాలు..