మిగిలిన అన్నంతో రుచికరమైన రసగుల్లా.. ఎలా చేయాలంటే.?
TV9 Telugu
28 July 2024
రైస్ రసగుల్లా తయారీకి అన్నం, మైదాపిండి, పాల పొడి, కార్న్ ఫ్లోర్, పంచదార, నీళ్లు, యాలకుల పొడి, కావాలనుకున్నవారు డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసుకోవచ్చు.
ముందుగా ఒక మిక్సీ జార్ లో అన్నం వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ కు నెయ్యి రాసుకుని ఈ పేస్ట్ ను వేసుకోవాలి.
ఆ తర్వాత ఇందులో మైదాపిండి, పాలపొడి, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి. నెక్ట్స్ చేతులకు నెయ్యి రాసుకుంటూ అంతా చేతితో కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఉండలుగా చిన్న చిన్న రసగుల్లాలుగా నచ్చిన షేపులో చేసుకుని వాటిని ఒక పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు పాకం కోసం కళాయిలో పంచదార నీళ్లు వేసి వేడి చేయాలి. పంచదార పూర్తిగా కరిగిపోయాక.. యాలకుల పొడి వేసి కలపాలి.
ఈ సమయంలోనే రసగుల్లాలను కూడా పంచదార పాకంలో వేసి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత గిన్నెలో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే ఎంతో టేస్టీగా ఉండే రైస్ రసగుల్లా రెడీ.
ఇలా రసగుల్లా తినాలని పించినప్పుడల్లా.. ఇంట్లో ఉండే అన్నంతోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇవి రుచిగా ఉంటాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి