చలికాలం సమయంలో ఉష్ణోగ్రతలు పడిపోయే క్రమంలో ప్రజలు బయటి వాతావరణంలో గడిపే సమయం తగ్గుతుంటుంది.
దీంతో శరీరంలో విటమిన్ డీ లెవెల్స్ తగ్గుతాయి. విటమిన్ డీతో ఎముకల బలోపేతంతో పాటు ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
గుండె, కిడ్నీలను కాపాడేలా కండరాలను పటిష్టం చేసేందుకు విటమిన్ డీ అవసరం. అధిక సమయం ఇంటిపట్టునే ఉండేవారు సహజమైన వెలుగు పడేలా విండోస్ వద్ద ఉండేలా చూసుకోవాలి.
దైనందిన జీవితంలో చలికాలం సమయంలో ఉదయం పూట సూర్యరశ్మిలో వ్యాయామం చేస్తే విటమిన్ డీ పుష్కలంగా అందుతుంది.
ఇక గుడ్డు, పోర్టిఫైడ్ డైరీ ఉత్పత్తులు, చేపలు, మష్రూమ్స్ వంటి ఆహార పదార్థాల్లో విటమిన్ డీ పుష్కలంగా దొరుకుతుంది. విటమిన్ డీ సప్లిమెంట్స్‌ను క్రమం తప్పకుండా వాడాలి.