ప్రయాణాల్లో వాంతులా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం..

TV9 Telugu

08 July 2024

సాధారణంగా చాలామందికి బస్సు ప్రయాణాలు చేస్తే కడుపు తిప్పడం లేదా వాంతులు అవ్వడం లాంటివి జరుగూతూ ఉంటాయి. 

అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు చిటికెలో ఉపశమనం కలిగించే ఒక అద్భుతమైన చక్కటి చిట్కా ఇప్పుడు తెలుసుకుందాం

అల్లం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే వికారాన్ని తగ్గించడంలో చక్కని ఔషధం‎గా పనిచేస్తుంది

ఓ కప్పు అల్లం ఛాయ్ తాగితే వికారం, వాంతులు, అజీర్తి మొత్తం దెబ్బకు తగ్గుతుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు

జీర్ణక్రియ వేగాన్ని పెంచి మంచి ఆకలి కలగడమే కాకుండా జాయింట్ నొప్పులకు మంచి ఉపశమనం కలిగిస్తుందంటున్నారు

అసలే వర్షాకాలం ప్రారంభమైంది. ఇప్పుడు వచ్చే జలుబు, దగ్గు, గొంతు సమస్యలకు చక్కని ఉపశమనాన్ని అందిస్తుంది

అల్లంలోని జింజెరాల్‌కు యాంటీ ఇన్‌ఫ్లమేటరీలు ఆర్థరైటిస్, కండరాల నొప్పులు రాకుండా చేసేందుకు దోహదపడుతుంది

ఒత్తిడిని, శారీరక శ్రమను తొలగించడమే కాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‎ను అదుపులో ఉంచుతుంది అల్లం టీ