రోజూ గుడ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే రోజుకొక్క గుడ్డు తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కానీ చాలామంది ఇష్టమని ఒకటికి మించి గుడ్లు తింటుంటారు. ఇలా తినడం వల్ల ఎన్ని అనర్ధాలు జరుగుతాయో తెలుసా?
గుడ్లు ఎక్కువగా తినడం వల్ల జీర్ణాశయంలో సమస్యలు వస్తాయి. అంతేకాదు ఎక్కువగా గుడ్లు తినడం వల్ల కిడ్నీలో సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందట.
గుడ్లు ఎక్కువగా తినడం వల్ల జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది. గుడ్డులో విటమిన్ ఏ,బి12,డి,ఈ,ఒమేగా3 వంటి పోషకాలులభిస్తాయి. రోజుకు రెండు గుడ్లు తింటే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు.
ఒక గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి.
ఏ వయస్సులోనైనా ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతిరోజూ ఒక గుడ్డు తినవచ్చు. ఒకటికి మించి ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
ఆమ్లెట్ తయారు చేసుకుని తినడం కంటే ఉడికించిన గుడ్లు తినడం మంచిది. వారానికి 5-6 గుడ్ల కంటే ఎక్కువ తినకపోవడమే మంచిది. లేదంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
రోజుకు 2-3 గుడ్లు తినే వారు గుడ్డులోని పచ్చసొనకు దూరంగా ఉండాలి. గుడ్డు పచ్చసొన ఎక్కువగా తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది.
ఇప్పటికే కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నట్లయితే, గుడ్లు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. గుడ్డు అలెర్జీ ఉంటే, గుడ్లు తినమని ఎవరినీ బలవంతం చేయకూడదు.