దంతాలు పచ్చగా ఉన్నాయా.. ఈ చిట్కాలతో మెరిసే దంతాలు మీ సొంతం..

21 August 2023

పచ్చగా రంగు దంతాలను తిరిగి తెల్లగా అందంగా మార్చాలంటే ఇంట్లోనే తీసుకవలసిని చిట్కాల ఏంటో తెలుసుకుందాం.

దంతాలు పసుపు రంగును పోగొట్టడానికి కొబ్బరి నూనెను కొంత సమయం పాటు పళ్లపై ఉంచి రుద్దాలి. ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది.

రాత్రిపూట దంతాల మీద నారింజ తొక్కను రుద్దితే నోటి దుర్వాసన పోయి దంతాలపైన పేరుకున్న మురికి తొలగిపోతుంది.

ఒక టీస్పూన్ ఉప్పులో నిమ్మరసం, ఆవనూనె కలిపి పేస్ట్‌లా 3 రోజులు బ్రష్ చేయడం వల్ల దంతాలపై పసుపు పొరను చాలా వరకు తగ్గుతుంది.

పూర్వం దంతాలను శుభ్రపరిచేందుకు ప్రతిఒక్కరూ వాడినది వేప పుల్ల. ఇది మన దంతాల పసుపు రంగును తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.

పేస్ట్ తో కన్నా వేపపుల్లతో దంతాలను బ్రష్ చేయడం వల్ల నోటి దుర్వాసన పోతుంది. దీంతో పాటు దంతాలు తెల్లగా మెరిసిపోతాయి.

పసుపు పళ్లను పోగొట్టడానికి, స్ట్రాబెర్రీ, ఉప్పును కలిపి మెత్తగా చేసి, బ్రష్ సహాయంతో దంతాలను శుభ్రం చేస్తే, దంతాలు తెల్లగా మెరుస్తాయి.

వేప పండ్లు కూడా దంతాల పసుపు రంగును తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిని తింటే ఆరోగ్యానికి కూడా ఎన్నో లాభాలు ఉన్నయి.