Constipation

ఈ చిట్కాలతో మలబద్దక సమస్య దూరం..

09 August 2023

Constipation Problem

మలబద్దకం సమస్యతో బాధపడేవారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. వంటింట్లో లభ్యమయ్యే కొన్ని పదార్థాలతో మలబద్దకానికి చెక్ పెట్టవచ్చు.

Curd And Flax Seeds

పెరుగు, అవిగిసె గింజల పొడిని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకున్నట్లయితే.. మలం మృదువుగా, సులభంగా బయటకు వెళ్లేలా చేస్తుంది.

Amla Juice

ఉదయం పూట ఒక గ్లాసు నీటిలో సుమారు 30 మిల్లీలీటర్ల ఉసిరి రసాన్ని కలిపి తీసుకుంటే మలబద్ధకం సమస్య తీరుతుంది.

వోట్ ఊకలో కరిగే, కరగని ఫైబర్స్ రెండూ ఎక్కువగా ఉంటాయి. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగించడంతోపాటు ప్రేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

మీరు నిద్రపోయే ముందు ఒక కప్పు వేడి పాలలో 1 టీస్పూన్ నెయ్యి తీసుకోండి. మరుసటి రోజు ఉదయం మలబద్ధకాన్ని తగ్గించడానికి ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది.

నెయ్యి బ్యూట్రిక్ యాసిడ్ గొప్ప మూలం. ఇది పేగు జీవక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు మలం కదలికలో సహాయపడుతుంది.

ఆకుకూరలు పీచుతో సమృద్ధిగా ఉంటాయి. ఆకుకూరలు మలబద్దకం సమస్యను తీర్చడంతో పాటు బరువును కూడా తగ్గించడంలో సహాయపడాయి.

శరీరానికి కావాల్సినంత నీరు అందాక శరీరం డీహైడ్రెట్ అయి మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. అందుకే అధిక మొత్తంలో నీరు తాగితే మలబద్ధకాన్ని మెరుగుపరుస్తుంది.